అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర పదజాలంతో బీఆర్ఎస్ సభ్యులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విరుచుకుపడటం.. రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. సభలో తాను ఎందుకు సహనం కోల్పోవాల్సి వచ్చిందన్నది దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎమ్మె్ల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్.. సభలో తాను మాట్లాడుతున్న సమయంలో ఏం జరిగిందన్నది వివరించారు.