తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 'వర్కర్ టు ఓనర్' పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే అర్హులను గుర్తించి తొలుత సిరిసిల్ల జిల్లాలో పథకాన్ని అమలు చేయనున్నారు. పథకంలో భాగంగా ఒక యూనిట్ కింద రూ.8 లక్షల విలువైన 4 లూమ్స్ ఇవ్వనున్నారు. యూనిట్ విలువలో 50 శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంక్ లోన్, 10 శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.