చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 10 క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. చేనేత కార్మికులకు 90 శాతం రాయితీతో అధునాతన మగ్గం యంత్రాలు అందించటంతో పాటుగా.. వారికి శిక్షణ ఇచ్చేందుకు ఓ డిజైనర్‌ను సైతం అందుబాటులో ఉంచనుంది.