తెలంగాణలో 2.50 లక్షల కొత్త చేయూత పెన్షన్ల మంజూరు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ధ్రువీకరణ అధికార పరిధిని విస్తరించి ప్రక్రియను సులభతరం చేస్తున్నారు. వచ్చేనెల మొదటివారంలో అర్హులను ఎంపిక చేసి దసరా నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.