తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్ల కోసం దరఖాస్తులు భారీగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం వరకు 4,34,854 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 2,64,815 మంది వితంతువులు ఉన్నారు. ప్రభుత్వం 2.50 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఐదు కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరించారు. పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. మంగళవారం నుంచి అధికారులు దరఖాస్తుల వడబోత, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు అర్హతలను పరిశీలించి తుది లబ్ధిదారుల ఎంపికకు సహకరించనున్నారు.