హైదరాబాద్ నగరం న్యూయార్క్, లండన్, పారిస్ వంటి నగరాలతో పోటీ పడుతోంది. ప్రస్తుతం ఆయా నగరాల్లో అద్దెలు లక్షల్లో ఉండగా.. వాటి సరనసన హైదరాబాద్ కూడా చేరనుంది. తాజాగా.. నిలోఫర్ కేఫ్ యాజమాన్యం రాయదుర్గం ప్రాంతంలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసేందుకు సిద్ధం కాగా.. కళ్లు చెదిరిలే అద్దె చెల్లిస్తున్నట్లు తెలిసింది. ప్రతి నెలా రూ. 40 లక్షలు అద్దె చెల్లించేందుకు నిలోఫర్ అగ్రిమెంట్ చేసుకుందని సమాచారం.