కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలు తినే చాక్లెట్ల నుంచి నిత్యవసర సరకులు ఉప్పు, పసుపు వరకు కల్తీ చేస్తున్నారు. తాజాగా.. నెయ్యి, నూనెల తయారీ గురించి భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జంతు వ్యర్థాలను కుళ్లబెట్టి నెయ్యు తయారు చేస్తున్నట్లు తేలింది. హైదరాబాద్ శివారులో దాదాపు 100 కల్తీ నెయ్యి కేంద్రాలు ఉన్నట్లు తెలిసింది.