Visakhapatnam Mlc Bypoll Candidate Botsa: విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ఖరారయ్యింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం ప్రకటించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసి.. పలువురి పేర్లు పరిశీలించి.. చర్చించిన తర్వాత బొత్స పేరును ప్రకటించారు.