Supreme Court Judge Withdraws From Jagan Case: జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ కేసుల విచారణ నుంచి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ తప్పుకొన్నారు. ఈడీ కేసుల్లో తీర్పు సీబీఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఈడీ.. సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. ఈ పిటిషన్.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఎదుట ఇవాళ విచారణకు వచ్చింది. ఈ విచారణ నుంచి తప్పుకొంటున్నట్టు జస్టిస్ సంజయ్ కుమార్ తెలిపారు.