Marri Rajasekhar To Join TDP: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రతిసారి తనకు మాట ఇచ్చి.. తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోవడం తనను తీవ్రంగా బాధించిందన్నారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. వైసీపీని వీడటానికి పార్టీ అధినేతే కారణమని.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి జగన్ దగ్గర కనిపించలేదన్నారు. . ఎంతో ఓర్పుగా ఉన్నప్పటికీ జగన్ విధానాలు, నిర్ణయాలు నచ్చక బయటకు రాక తప్ప లేదన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు.