వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు అంటే అందర్ని ఏకం చేస్తుందని అంటారు. కుల, మతాల మధ్య అంతరాన్ని తొలగించి.. చిన్న, పెద్ద అంతా ఆ తొమ్మిది రోజులు భక్తి, భావనలో మునిగిపోయి సంతోషంగా గడుపుతారని చెబుతుంటారు. అయితే, ఇలా మాటలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ, ఇప్పటికీ గ్రామాల్లో.. కొన్ని చోట్ల కులం, డబ్బు ప్రజల మధ్య అంతరాలను సృష్టిస్తూనే ఉంది. కేవలం గణేష్ చందా ఇవ్వలేదని చెప్పి.. వినాయకుడి వద్ద కొబ్బరికాయ కొట్టకూడదని అన్నారు. పైగా చందా ఇవ్వని ఆ కుటుంబాలను టార్గెట్ చేసి వాళ్లతో గొడవ పడి వారిని బహిష్కరించారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.