జనగామ జిల్లా కేంద్రంలో కారు బీభత్సం సృష్టించింది. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం ఎదుట పార్కింగ్ చేసినటువంటి వాహనాలపైకి కారు అతివేగంగా దూసుకొచ్చింది. మద్యం మత్తులో యువకులు కారును నడిపినట్లు తెలిసింది. ప్రమాదం ధాటికి అక్కడ పాదచారులు ఎగిరిపడ్డారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఒక మహిళకు కాలు విరగ్గా.. సమీప ఏరియా ఆస్పత్రికి తరలించారు. పదుల కొద్దీ బైక్స్ ధ్వంసమయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.