Ganta Prasada Rao: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయ. ఇటీవలే జెడ్పీ ఛైర్ పర్సన్ దంపతులు ఘంటా పద్మశ్రీ, ప్రసాదరావులు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసింేద. అయితే వారిద్దరు జనసేన పార్టీలో చేరతామని మీడియా ముందు ప్రకటించారు. కానీ ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. పద్మశ్రీ భర్త ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలో పసుపు కండువాను కప్పుకున్నారు. త్వరలో పద్మశ్రీ కూడా టీడీపీలో చేరబోతున్నారట.