జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రారంభ ప్రసంగం ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. దేశంలోని వివిధ భాషల్లో తన ప్రసంగాన్ని కొనసాగించిన జనసేనాని.. ఉపన్యాసం ప్రారంభంలోనే తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జనసేన పుట్టింది తెలంగాణలో అని.. పనిచేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లో అని పేర్కొన్నారు. అయితే తెలంగాణలోనూ ఇప్పుడు జనసేన పార్టీ కార్యకలాపాలు యాక్టివ్ చేస్తుందా అనేది పవన్ వ్యాఖ్యలతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.