ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో పదే పదే ప్రస్తావిస్తున్న అంశం.. జనాభా పెరుగుదల.. ఏపీలో జనాభా పెరుగుదల తగ్గుముఖం పడుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆందోళన వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అయితే జనాభా పెరుగుదల కోసం పిల్లలను కనమని చెప్తున్న ప్రభుత్వం.. జనాభా పెరుగుదల కోసం విదేశాలు అనుసరిస్తున్న విధానాలను అనుసరించగలదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు జనాాభా పెరుగుదల కోసం చైనా ఏం చేస్తోంది.. ఏపీ కూడా అలా చేయడం సాధ్యమేనా అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.