హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న హైడ్రా కూల్చివేతల వివాదం హైకోర్టుకు చేరుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడ ఫాంహౌస్‌కు కూడా హైడ్రా ఎఫెక్ట్ పడటంతో.. దాని ఓనర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌పై బుధవారం రోజున విచారణ జరిగింది. ఈ క్రమంలో.. హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫాంహౌస్ కూల్చివేతను ఆపేయాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.