హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధులపై దాడి ఘటన చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు వ్యవహరించిన తీరును మీడియా ప్రతినిధులు, జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్ట్ ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ 118(1)కింద కేసు బుక్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఆయన లైసెన్స్‌డ్ గన్స్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.