హైదరాబాద్‌లో చెత్త సమస్యకు జీహెచ్‌ఎంసీ ఈ-చలాన్ విధానం ప్రవేశపెట్టింది. ఇది బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని నియంత్రించడమే కాకుండా.. వ్యర్థాల ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కల్పించింది. అధికారులకు డిజిటల్ రూపంలో పెనాల్టీల వినియోగం ద్వారా ఆదాయ వివరాల్లో కచ్చితత్వం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కొత్త సాంకేతికతతో ఈ చెత్త విధానానికి పరిష్కార మార్గాలను అధికారులు చూపెడుతున్నారు.