టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే తాను అరెస్టయి చంచల్ గూడాలో రిమాండ్ ఖైదీగా ఉండగా.. తనకు వచ్చిన నేషనల్ అవార్డు రద్దు కావటం, తనపై బెంగతో ఆయన తల్లికి గుండెపోటు రావటం జానీ మాస్టర్‌కు ఒకటి తర్వాత ఒకటి చేదు వార్తలు వినిపిస్తుండగా.. ఇప్పుడు న్యాయస్థానం కూడా మరో చేదు వార్తే వినిపించింది. తనకు బెయిల్ కావాలని వేసిన పిటిషన్ మీద విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కీలక తీర్పునిచ్చింది.