అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్‌కు జానీ మాస్టర్ ఉసురు తగిలిందని అన్నారు. జానీని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించటంలో అల్లు అర్జున్ కుట్ర ఉందని.. ఆ ఊసురు తగిలే నేడు జైలుకు వెళ్లాడని ఆరోపించారు. నేషనల్ అవార్డు తానొక్కడికే ఉండాలనే కుట్రతో అల్లు అర్జున్ జానీ మాస్టర్ అరెస్టుకు ప్లాన్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు మల్లన్న.