జీఎస్టీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 1000 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని బావిస్తున్న ఈ కేసులో ఏ-5గా ఉన్న మాజీ సీఎం సోమేష్ కుమార్‌తో పాటు మరో నలుగురు అధికారులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే కీలక విషయాలు వెలుగులోకి రాగా.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నిందితులకు త్వరలోనే నోటీసులు ఇచ్చి.. అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.