యజమాని డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓనర్ భార్య వద్ద నుంచి ఓ గుమస్తా బంగారం చోరీ చేసిన ఘటన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. సుబ్బయ్య అనే వ్యక్తి నడుపుతున్న కిరాణా దుకాణంలో రసూల్ అనే వ్యక్తి గుమస్తాగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో రసూల్‌కు డబ్బులు అవసరం పడింది. దీంతో యజమానిని జీతం డబ్బులతో పాటుగా అదనంగా పది వేల రూపాయలు ఇవ్వాలని రసూల్ కోరాడు. ఇందుకు యజమాని అంగీకరించాడు. అయితే ఎన్ని రోజులు గడుస్తున్నా డబ్బులు మాత్రం ఇవ్వడం లేదనే కోపంతో యజమాని భార్య వద్ద నుంచి బంగారం బలవంతంగా లాక్కెళ్లాడు. ఈ కేసును ప్రొద్దుటూరు పోలీసులు 12 గంటల్లో ఛేదించారు.