రాఖీ పండగ రోజున ఆర్టీసీ బస్సులో పురుడు పోసుకున్న చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ లైఫ్ టైం సెటిల్‌మెంట్ ఆఫర్ ప్రకటించింది. చిన్నారిని జీవితకాలం పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ఇచ్చింది. డెలివరీకి సహాయ పడిన నర్సుకు కూడా.. లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది టీజీఎస్ ఆర్టీసీ. ఈమేరకు.. హైదరాబాద్ బస్ భవన్‌లో కండక్టర్, డ్రైవర్, నర్సులను ఆర్టీసీ అధికారులు అభినందించారు.