అల్లూరి జిల్లా పాడేరులో ర్యాగింగ్ కలకలం రేపింది. పాడేరు సెయింటాన్స్ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థినిపై పదో తరగతి విద్యార్థినులు దాడి చేశారు. తమ గురించి హాస్టల్ వార్డెన్‌కు చెప్పిందనే కోపంతో బాలికను కొట్టారు. ఈ వీడియో ఆదివారం నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో విషయం కాస్తా జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి చేరింది. దీంతో డీఈవో ఆదేశాలతో ఎంఈవో దీనిపై విచారణ చేపట్టారు. అలాగే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు హాస్టల్ వార్డెన్‌ను విధుల నుంచి తప్పించిన యాజమాన్యం.. పదో తరగతి విద్యార్థినులు ముగ్గురిని హాస్టల్ నుంచి ఇళ్లకు పంపివేసింది.