తన కుమారుడి చికిత్సకు సాయం చేస్తానన్న జూనియర్ ఎన్టీఆర్ నుంచి తమకు ఇంకా సాయం అందలేదని కౌశిక్ తల్లి సరస్వతమ్మ తెలిపారు. తిరుపతికి చెందిన కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. కౌశిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తారక్.. దేవర సినిమా విడుదల సమయంలో కౌశిక్‌ను వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. చికిత్సకు సాయం చేస్తానని మాట ఇచ్చారు. అయితే జూనియర్ నుంచి తమకు సాయం అందలేదని.. ప్రభుత్వం 11 లక్షలు, టీటీడీ 40 లక్షలు అందించారని చెప్పారు.