కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా రేట్ల పతనంపై ప్రభుత్వం స్పందించింది. టమాటా కిలో రూపాయి పలకడంపై గురువారం రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టమాటా ధరపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్షించారు. లాభ నష్టాలు లేకుండా పత్తికొండ మార్కెట్‌లో టమాటా కిలో రూ.8కి కొనుగోలు చేయాలని.. మార్కెటింగ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అదే ధరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో విక్రయించాలని ఆదేశించారు. రైతులకు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా టమాటా విక్రయాలు జరపాలని సూచించారు.