ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇండియా-పాకిస్థాన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు టర్కీ వెళ్తానని చెప్పడమే కాక.. వెళ్లి చూపించారు. అక్కడ మహదీ ఛైర్మన్‌తో కలిసి పాకిస్థాన్‌కు టర్కీ క్షిపణులు అమ్మడం నిజమేనని, భారతీయులు టర్కీని బహిష్కరిస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలు ఆయుధాలు అమ్మకూడదని, యుద్ధాల వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక అమెరికా తీరుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ వివరాలు..