విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు అమానుషంగా వ్యవహరించారు. మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటన కర్నూలు జిల్లా హోళగుందలో చోటుచేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎంఈవో ఉపాధ్యాయుడిపై విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.