మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయాలంటూ వైసీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మహిళలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించారు. టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అంటూ చంద్రబాబు మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇంఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.