విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఓ ప్రయాణికుడు.. తన బ్యాగులో రూ.23 లక్షలు తీసుకొస్తున్నాడు. అయితే.. మధ్యలో టిఫిన్ చేసేందుకు బస్సు ఆగటంతో.. కిందికి దిగి గబగబా తినేది బస్సు ఎక్కాడు. తీరా వచ్చి చూస్తే.. సీట్‌లో డబ్బులతో ఉన్న బ్యాగు కనిపించలేదు. చుట్టూ వెతికి.. అందరినీ అడిగి.. చివరికి చేసేదేంలేక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలు పరీశిలిస్తున్నారు.