సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో సిగరెట్ ఓ ఉపాధ్యాయుడి ప్రాణం తీసింది. మద్యం మత్తులో సిగరెట్ తాగి.. ఆర్పకుండా అలాగే పడుకోవటంతో మంచానికి మంటలు అంటుకొని ఉపాధ్యాయుడు సజీవదహనం అయ్యాడు. తాగిన మైకం, నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సిగరెట్ తాగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని.. నిర్లక్ష్యంగా ఉంటే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొని ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు.