Rs 10000 Fine For TGSRTC: ఒకే దూరానికి వేర్వేరు బస్ ఛార్జీలు వసూలు చేయడంపై వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ని ప్రశ్నించింది. ఖమ్మం డిపో పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఒక ప్రయాణికుడి నుంచి అదనంగా ఛార్జీ వసూలు చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఎల్బీనగర్ నుండి సూర్యాపేటకు వెళ్ళిన ప్రయాణికుడికి తిరుగు ప్రయాణంలో అధికంగా ఛార్జీ వసూలు చేశారు. దీనిపై వినియోగదారుల కమిషన్ జోక్యం చేసుకుని సంస్థకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..