అన్యమతాలకు చెందిన ఉద్యోగుల విషయంలో టీటీడీ పలు ఆలోచనలు చేస్తోంది. అన్యమతాలకు చెందిన ఉద్యోగులను వేరే చోటకు బదిలీ చేయడం లేదా వీఆర్ఎస్‌కు పంపించాలనే ఆలోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో అన్యమతాలకు చెందిన ఉద్యోగుల ఆంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలోనే 29 మంది ఉద్యోగులను వీఆర్ఎస్‌కు పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వీఆర్ఎస్‌కు అంగీకరిస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటుగా అదనంగా రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.