రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టాన్ని జన విశ్వాస్ పేరిట సవరించింది. ఈ మారిన చట్టాల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారికి రైల్వే రక్షక దళం (RPF) ఇకపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనుంది. కాజీపేటలో ఆర్పీఎఫ్ అధికారులు దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. టికెట్ లేని ప్రయాణం, మహిళల కోచ్‌లోకి ప్రవేశించడం, ధూమపానం వంటి పలు నేరాలకు జరిమానాలు భారీగా పెంచారు. ఫైన్ కట్టకుంటే కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపనున్నారు.