తిరుమల పవిత్ర, భక్తుల మనోభావాలే లక్ష్యంగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభించింది. 18మంది అన్యమత ఉద్యోగులను గుర్తించి వారికి మెమోలిచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో టీటీడీలో అన్యమత ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. ఇతర మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు.