టీడీపీ అధిష్టానంపై యనమల రామకృష్ణుడు?.. అందుకే డుమ్మా కొట్టారాై

1 month ago 3
యనమల రామకృష్ణుడు.. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం.. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మూలస్తంభం.. కానీ, అదే పార్టీలో గత కొంతకాలంగా చర్చనీయాంశం అవుతున్నారు ఈ సీనియర్ పొలిటికల్ లీడర్. 75 ఏళ్ల వయసున్న యనమల.. తన 40 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక పదవులు అనుభవించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో కూడా కేబినెట్ మంత్రిగా పనిచేశారు. మండలి నుంచి ఆయనకి చంద్రబాబు మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. కానీ, గడిచిన ఐదారేళ్లుగా రామకృష్ణుడి వ్యవహార శైలి టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా రామకృష్ణుడు శాసనమండలి సభ్యుల వీడ్కోలు కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో మళ్లీ ఇప్పుడు ఆయన తీరుపై పార్టీలో అంతర్గత విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన కార్యక్రమానికి యనమల ఎలా డుమ్మా కొడతారని కొంతమంది టీడీపీ నేతలు రగిలిపోతున్నారట. అయితే, టీడీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితోనే యనమల గైర్హాజరు అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Entire Article