టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కొత్త పదవి.. కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం

1 year ago 48
తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఆంధ్రప్రదేశ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తారు. రైతుల సంక్షేమానికి, పారదర్శక ధాన్యం సేకరణకు కృషి చేస్తానని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ నియామకం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ పార్లమెంట్ పార్టీ నేతగానూ వ్యవహరిస్తున్నారు.
Read Entire Article