Tdp Followers Insurance Hiked To Rs 5 Lakhs: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో మాదిరే వాట్సప్ ద్వారా టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రస్తుతం రూ. 2 లక్షలు ఉన్న ప్రమాద బీమాను రూ. 5 లక్షలకు పెంచారు. అన్న క్యాంటీన్లకు ప్రజల నుంచి సహకారం లభిస్తోందని.. ఇప్పటికి కార్పస్ ఫండ్‌గా రూ. 15 కోట్లు వచ్చింది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పొలిట్‌బ్యూరోలో చర్చించారు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు చంద్రబాబు.