మంత్రి పార్థసారథి టీడీపీ కార్యకర్తలకు మరోసారి క్షమాపణలు చెప్పారు.నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్‌తో కలిసి పాల్గొనడం ద్వారా టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. ఈ విషయం గురించి మీడియా సమావేశం నిర్వహించిన పార్థసారథి.. సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తనకు ఎంతో గౌరవం ఇచ్చారన్నారు. ఆ గౌరవాన్ని ఎప్పుడూ మర్చిపోనని.. టీడీపీ సిద్ధాంతాలను దెబ్బతీసే వ్యక్తిని కాదని అన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా.. జాగ్రత్తలు తీసుకుంటానన్న మంత్రి .. టీడీపీ కార్యక్రమాల్లోకి దూరటం వైసీపీ నేతలకు అలవాటేనని.. అక్కడ జోగి రమేష్‌ను చూసి తాను కూడా షాక్ తిన్నానని చెప్పారు. జోగి రమేష్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవని స్పష్టం చేశారు.