Buddha Venkanna Comments On Tdp: అధికారంలో ఉన్నా పదవి ఉంటేనే ఏదైనా చెల్లుతుందంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పదవి లేకనే తాను ఏం చేయలేకపోతున్నానని. ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి లేక పోవడంతో తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నానన్నారు. తన మీద మొత్తం 37 కేసులు ఉన్నాయని.. కేవలం టీడీపీ కోసమే ఆ 37 కేసులు పెట్టించుకున్నానన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగలేదని.. వ్యతిరేకతతో కాదు.. ఆవేదనతో ఇవన్నీ చెబుతున్నాను అన్నారు.