భారత్‌లో తమ కార్లు తయారీ యూనిట్ ప్రారంభిస్తామని ఇటీవల ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్లాంట్ కోసం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. భారీగా ప్రోత్సహకాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏఐ సాంకేతికతో రూపొందించిన ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ మన రాష్ట్రంలోనే పెట్టేలా టెస్లా ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.