ట్రాక్టర్‌తో గుద్ది.. రౌండ్లు, రౌండ్లు వేసి.. అయ్యా పవన్ మీకిదే రిక్వెస్ట్: అంబటి రాంబాబు

3 hours ago 1
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర దాడి జరగటంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి గేటును ట్రాక్టర్‌తో గుద్ది ధ్వంసం చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. ముద్రగడ ఇంటి వద్ద భయానక వాతావరణం సృష్టించారని, ఫ్లెక్సీలు చింపి అరాచకానికి పాల్పడ్డారని వివరించారు. దాడి చేసిన వ్యక్తి తాను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పారంటున్న అంబటి రాంబాబు.. దీంతో దాడి చేసింది జనసేన కార్యకర్త అని స్పష్టమైందన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్..ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
Read Entire Article