హైదరాబాద్‌లో ట్రాఫిక్ చలాన్ల వసూళ్లకు టెక్నాలజీని ఉపయోగించే సరికొత్త విధానాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనదారుల నుంచి జరిమానాలను ఫాస్టాగ్ ద్వారా ఆటోమేటిక్‌గా వసూలు చేసే ప్రతిపాదనపై హెచ్‌ఎండీఏతో చర్చలు జరుపుతున్నారు. పెండింగ్ ఈ-చలాన్లను తగ్గించడం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడాన్ని కంట్రోల్ చేయడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ కొత్త విధానానికి సంబంధించి.. అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.