హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి ముఖ్య గమనిక. ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ రైల్వే డివిజన్ల పరిధిలో పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి హైదరాబాద్, కాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే ట్రైన్లు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు రద్దు చేశారు.