హైదరాబాద్‌లో పేదలకు కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసించని లబ్ధిదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మౌలిక సదుపాయాలు కల్పించినా.. ఇప్పటికీ ఇళ్లకు తాళం వేయటం లేదా అద్దెకు ఇచ్చిన 8 వేల మంది నుంచి ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని డిసైడ్ అయింది. ఆయా ఇళ్లను వెయిటింగ్ లిస్ట్‌లోని అర్హులైన పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. కాలనీల అభివృద్ధికి దుకాణాల వేలం, నిత్యావసరాల కోసం గల్లీ బజార్ల నిర్వహణ వంటి చర్యలు చేపడుతోంది.