Bhatti Vikramarka House: తెలంగాణలో సంచలన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి.. లోపల ఉన్న నగదు, బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి దర్యాప్తు మొదలుపెట్టారు. కట్ చేస్తే.. నిందితులు యూపీలో పోలీసులకు పట్టుబడ్డారు.