తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు లీగల్ నోటీసులు పంపారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాంచందర్‌రావు ఆరోపించారు. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేకుంటే రూ.25 లక్షల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ దళితులను రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.