Ganesh Navaratri Utsavalu: హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల నిర్వాహణపై రాచకొండ సీపీ సుధీర్ బాబు.. సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొనగా.. సీపీ సుధీర్ బాబు కీలక ఆదేశాలు చేశారు. గణేష్ మండపాల్లో డీజేకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. మరోవైపు.. మండపాల్లో నిర్వాహకులు పేర్లు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు.