AP Cid Notice To Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీ ప్రకాశం జిల్లా ఒంగోలులో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మద్దిపాడులో నమోదైన కేసులో సతమతం అవుతుంటే మరో కేసు కూడా తెరపైకి వచ్చింది.. ఈ మేరకు వర్మకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాలని ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో ఆయనకు సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు ఇచ్చారు. 2019లో ఆర్జీవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విషయంలో గతేడాది నవంబర్‌లో కేసు నమోదైంది.