ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత వెనక్కి తీసుకున్నారు. పదే పదే వాయిదాలు కోరడంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు. వాదనలు వినిపించకపోతే పిటిషన్ విత్‌డ్రా చేసుకోవాలని సూచించారు. దీంతో కవిత తన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు.